మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సోమవారం మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తో సహా సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ లు ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ప్రీ లుక్ గా వచ్చిన పోస్టర్ పై పంజా వైష్ణవ్ తేజ్ అని రాశారు. మెగా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు.
ఆ క్రేజ్ కొత్త హీరోకి వాడే క్రమంలోనే వైష్ణవ్ తేజ్ ముందు పంజా అని పవన్ సినిమా టైటిల్ చేర్చారని అనుకున్నారు. కాని అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ, కొణిదెల చిరంజీవి, అక్కినేని నాగార్జున ఇలా ఇంటి పేరుని బలంగా చెప్పే ప్రయత్నం ఎన్నాళ్ల నుండో ఉంది. వైష్ణవ్ తేజ్ ను అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. పంజా అనేది వాళ్ల ఇంటి పేరు అని తెలుస్తుంది. మరి ఈ వైష్ణవ్ తేజ్ పంజా ఏమాత్రం ఉంటుందో చూడాలి. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా బుచ్చి బాబు డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.