‘ఆ పనికి ఓకే చెబితే వెంటనే షూటింగ్ అన్నారు’.. రెజీనా సంచలన వ్యాఖ్యలు

-

 

యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ..SMS( శివ మనసులో శ్రుతి) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ సుందరి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాల్లో నటిస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి నటించిన రెజీనా..ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో..మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి నటించింది.

చిరు నటించిన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ చేసింది రెజీన. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ లో చిరుకు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది రెజీనా కసాండ్ర. అయితే.. తాజాగా హీరోయిన్ రెజీనా కసండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యానని హీరోయిన్ రెజీనా కసండ్రా తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చూస్తుండగా ఓ వ్యక్తి కాల్ చేసి….’అడ్జస్ట్మెంట్ కి ఓకే అంటే ఛాన్స్ ఇస్తా. వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదాం’ అని అన్నట్లు ఆమె వెల్లడించారు. అప్పుడు ఆమెకు అడ్జస్ట్మెంట్ అంటే తెలియదని… తన మేనేజర్ చెబితే తెలిసిందన్నారు. ఆ తర్వాత ఎప్పుడు తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version