‘టికెట్ ఇవ్వొద్దు’ కారులో ఇదేం లొల్లి.!

-

ఓ వైపు కే‌సి‌ఆర్ ఏమో అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టారు. దాదాపు మూడు రోజుల్లో మొదట లిస్టు కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. 87 మందితో ఫస్ట్ లిస్ట్ వదులుతారని సమాచారం. అయితే ఇలా అభ్యర్ధుల ఎంపికపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో..మరోవైపు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని సొంత బి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలే లొల్లి లొల్లి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి నెలకొంది.

కే‌సి‌ఆర్ అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో ఉంటే..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే తామే ఓడిస్తామని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి. దీంతో బి‌ఆర్‌ఎస్ పార్టీలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఒకవేళ అభ్యర్ధులని ఫిక్స్ చేశాక అదే లొల్లి కొనసాగితే పార్టీకే నష్టం. ఇప్పటికే పలు స్థానాల్లో ఈ రచ్చ ఎక్కువగా ఉంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీటు ఇస్తే ఊరుకోమని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి లేదా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇటు స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్యకు మళ్ళీ సీటు ఇవ్వవద్దని సొంత పార్టీ వాళ్ళే కోరుతున్నారు.

ఇక వీరిద్దరి సీటు విషయంలో కే‌సి‌ఆర్ ఏం చేస్తారో చూడాలి. అటు కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, కామారెడ్డిలో గంప గోవర్ధన్, ఆందోల్ లో క్రాంతి కిరణ్..ఇలా కొంతమంది ఎమ్మెల్యేలక్ మళ్ళీ సీట్లు ఇవ్వడంపై సొంత పార్టీ వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు. అటు కల్వకుర్తి, అచ్చంపేటల్లో అదే పరిస్తితి ఉంది. వికారాబాద్, తాండూరు, కొల్లాపూర్ ల్లో రచ్చ ఉంది. ఇక ఖమ్మంలో ఈ రచ్చ మరింత ఎక్కువ ఉంది. ఇల్లందు, పినపాక, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే మాత్రం సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు. మరి ఈ రచ్చకు కే‌సి‌ఆర్ బ్రేకులు వేసి..అభ్యర్ధులని ఎలా ఎంపిక చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version