శ్రీలీలా తల్లి పై FIR నమోదు.. అసలేమైందంటే ..?

-

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన తాజా చిత్రం పెళ్లి సందD.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే నటిగానే కాకుండా పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో వివాదాలను కూడా ఫేస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే శ్రీ లీల తల్లి పై తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ఇక శ్రీ లీల తల్లి స్వర్ణలతపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. గత అక్టోబర్ 3వ తేదీన బెంగళూరులో కోరమంగళలో ఉన్న తన అపార్ట్మెంట్లోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా స్వర్ణలత ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు అపార్ట్మెంట్ డోర్ లాక్ కూడా పగలు కొట్టినట్టు శుభకర రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

శుభకర రావు ఎవరో కాదు శ్రీ లీలా ఫాదర్ .. 20 సంవత్సరాలుగా శ్రీ లీల మదర్ , ఫాదర్ విడివిడిగా ఉంటున్నారు. అంతేకాదు వీళ్ళ విడాకుల పిటిషన్ కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉండగా గతంలో కూడా శ్రీ లీల తల్లి స్వర్ణలతపై అనేక కంప్లైంట్ లు పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యాయి. అప్పట్లో ఒక యూనివర్సిటీ వ్యవహారాలకు సంబంధించి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక అంతేకాదు అప్పట్లో శ్రీ లీల తండ్రి శుభకరరావు శ్రీ లీల తనకు పుట్టలేదని వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఇకపోతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ద్వారా తెలుగుతెరకు పరిచయమైన శ్రీ లీల ప్రస్తుతం 8 మంది స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఒక యంగ్ హీరోయిన్ చేతిలో ఇన్ని ప్రాజెక్టులు ఉండడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version