కొన్నేళ్ల తర్వాత రెండో పెళ్లిపై ఆలోచిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేణు దేశాయ్. ప్రముఖ నటిగా, మోడల్ గా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో భారీ పాపులారిటీ అందుకున్న రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.
ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో ముంబైలో జీవిస్తోంది. అయితే..పవర్ నుంచి విడిపోయాక రెండో పెళ్లి చేసుకోవాలని చాలామంది సలహా ఇచ్చారని రేణు దేశాయ్ తెలిపారు. దీంతో కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….’ఆ టైంలో ఆద్యకు ఏడేళ్లు. పెళ్లి చేసుకుంటే ఆమెకు టైం ఇవ్వలేనని భావించి పెళ్లి రద్దు చేసుకున్నా. ఇప్పుడు ఆద్యకు 13 ఏళ్లు. ఆమె కాలేజీకి వెళ్లిన తర్వాత పెళ్లి గురించి, నా గురించి ఆలోచిస్తా’ అని తెలిపారు.