రేవతి చనిపోయిన విషయం ఉదయం వరకు తెలియదు – అల్లు అర్జున్

-

సంధ్య థియేటర్ వద్ద రేవతి చనిపోయిన విషయం తనకు మరుసటి రోజు ఉదయం వరకు తెలియదని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఘటన జరిగాక అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నానని తెలిపారు. శనివారం రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించిన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నిర్మాత బన్నీ వాసును, తన తండ్రి అల్లు అరవింద్ ను వెళ్లి బాధితులను కలవాలని సూచించానని తెలిపారు.

న్యాయపరమైన చిక్కుల వల్ల తాను వారిని కలవలేక పోతున్నానని పేర్కొన్నారు. ఇక తాను సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేశానన్నది వాస్తవం కాదన్నారు. తాను ఎటువంటి ఊరేగింపులు చేయలేదన్నారు. పోలీసుల డైరెక్షన్ లోనే తాను థియేటర్ వెళ్లానని తెలిపారు. తనకు అనుమతి లేదని చెబితే అప్పుడే వెనక్కి వెళ్ళిపోయేవాడినని అన్నారు.

షో మధ్యలో కూర్చొని జనం బాగా ఉన్నారని చెప్పడంతో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని.. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని తెలిపారు. శ్రీ తేజ గురించి ప్రతి గంట అప్డేట్ తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం అబ్బాయి బాగున్నాడని అన్నారు. మీరు అలా అన్నారు, ఇలా అన్నారు అంటూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news