లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ 2: వర్మ నువ్వు మాములోడివి కాదయ్య..!

-

సంచలన దర్శకుడు వర్మ ఏం చేసినా ఎలా చేసినా అదో పెద్ద సంచలనమే.. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని ఓ సినిమా మొదలు పెట్టాడు ఆర్జివి. ఆ సినిమా మొదలైన నాటి నుండి ఎన్నో విమర్శలు.. సినిమా రిలీజ్ కానివ్వం అంటూ ఓ పక్క టిడిపి శ్రేణులు చెబుతున్నా వర్మ మాత్రం సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నాడు. ఇక సినిమా నుండి వచ్చిన ట్రైలర్ అదరగొట్టగా సెకండ్ ట్రైలర్ సినిమాపై ఇంకా క్యూరియాసిటీ పెంచింది.

మొదటి ట్రైలర్ చూశాక వర్మ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సినిమా చేస్తున్నాడని కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి తన టార్గెట్ ఎవరు.. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో ఏం చెప్పదలచుకున్నాడో చూపించాడు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా ఎప్పుడు చూడాలా అనే ఎక్సైట్మెంట్ కలిగేలా చేశాడు. అంతేకాదు కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో మిస్సైన ఎమోషన్ ను ఈ సినిమాలో బాగా పండిస్తున్నట్టు అనిపిస్తుంది. రాం గోపాల్ వర్మ, అగస్త్య మను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైలర్స్ హంగామా బాగుంది.. మరి సినిమా ఇంకెలా రచ్చ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version