RamGopalVarma : సిరివెన్నెల కు కిస్ అంటు వీడియో విడుద‌ల చేసిన ఆర్జీవీ

-

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల మ‌ర‌ణించిన సిరి వెన్నెల సీతారామా శాస్త్రి కి ఒక ముద్దు అని ఒక వీడియో ను విడుద‌ల చేశాడు. దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో లో రామ్ గోపాల్ వ‌ర్మ సిరి వెన్నెల సీతా రామా శాస్త్రి గురించి చెబుతున్నాడు. సిరి వెన్నెల పేరు లో నే త‌న ఆలోచ‌న విధానం ఉంద‌ని రామ్ గోపాల్ వ‌ర్మ ఈ వీడియో లో చెప్పాడు. సిరి వెన్నెల కు ఉన్న వ్య‌క్తి వ‌త భావాల వ‌ల్లే ఆయ‌న నుంచి మంచి మంచి పాటలు వ‌స్తాయ‌ని అన్నారు.

త‌న కేరీర్ లో ఇష్ట మైన సాంగ్ సిరి వెన్నెల సీతా రామా శాస్త్రికి రాసిన పాటే అని అన్నారు. అదే ఎప్పుడూ “ఓప్పు కోవ‌ద్దు రా.. ఓట‌మి ” అని చెప్పారు. అంతే కాకుండా ఆ పాట ను ఆర్జీవీ పాడారు. ఈ పాట ను ఆర్జీవీ త‌న స్టైల్ లో అద్భుతం గా ఆల‌పించారు. అంతే కాకుండా సిరి వెన్నెల సీతారామా శాస్త్రి ఫోటో కు కూడా ముద్దు పెట్టారు. కాగ ఈ వీడియో లో రామ్ గోపాల్ వ‌ర్మ పాడిన పాట హైలైట్ గా ఉంది. అయితే ఇటీవ‌ల సిరి వెన్నెల సీతారామా శాస్త్రి ఆనారోగ్యం తో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version