ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు రాయితీ పై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. గత రెండు సార్లు ట్రాఫిక్ చలాన్ల పై ఆఫర్ ఇచ్చినట్లు.. ఈసారి కూడా ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల పై రాష్ట్ర ప్రభుత్వం రాహితీ ఇస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దంటున్నారు పోలీసులు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేసారు పోలీసులు. ఈ చలాన్ల ఆఫర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంను ఎవరు నమ్మవద్దంటున్నారు ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్.
కేవలం అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే వాహనదారులు నమ్మాలని సూచనలు చేస్తున్నారు. వాహనదారులకు అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. అయితే మొదటిసారి పెండింగ్ చలాన్స్ పై 70 శాతం ఆఫర్ ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత 90 శాతం ఇచ్చారు. దాంతో ఈసారి కూడా ఆఫర్ ఉంటుంది అని అనుకుంటున్న వాహనదారులకు షాక్ ఇచ్చారు పోలీసులు.