ఊహించని విధంగా ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ 2

-

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకొని తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. గతంలో వంగవీటి సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో వైఎస్ జగన్ క్యారెక్టర్ ని తమిళ నటుడు అజ్మల్ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్ ని మానస రాధాకృష్ణన్ చేస్తున్నారు.  గతంలో ఆర్జీవీ వ్యూహం టీజర్ ని రిలీజ్ చేశారు. 

తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ వ్యూహం టీజర్ 2ని విడుదల చేశారు. టీజర్ లింక్ ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు వర్మ. ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులను చూపించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ, చిరంజీవి, రోశయ్య వంటి పాత్రలను పరిచయం చేశారు. వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన తదితర అంశాలను చూపిస్తూ 2:15 నిమిషాలు నిడివి కలిగిన టీజర్ ని కట్ చేశారు. ప్రస్తుతం వ్యూహం టీజర్ 2 సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version