సితార బ్యానర్ లో రిషబ్ శెట్టి మూవీ..!

-

కాంతారా సినిమాతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమా కి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ చేస్తున్న ఇతను.. ఇతను ఆ తరువాత ప్రశాంత్ వర్మ తీసే జై హాన్ మాన్ చేస్తాడు. దీని తరువాత ఓ హిందీ మూవీ లైన్ లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు సితారా ఎంటర్ టైన్ మెంట్స్ తీసే సినిమా చేయబోతుననాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

0

18 శతాబ్దంలో భారత్ లోని అల్లకల్లోలంగా ఉన్న ఫ్రావిన్స్ లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ క్రమంలోే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలోనూ దీనిని ఒకేసారి తీస్తారు. అనంతరం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news