సినీ నటుడు సోనూసూద్ కి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్..!

-

బాలీవుడ్, టాలీవుడ్ నటుడు, సమాజ సేవకుడు అయిన సోనూసూద్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. “ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉండే సోనుసూద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నిస్వార్థ దాతృత్వం, అవసరంలో ఉన్నవారికి మద్దతు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టింది. మీ రాబోయే సంవత్సరం ఆనందం, ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో మార్పును కొనసాగించడానికి నిరంతర శక్తితో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.

Sonusood

సోనూసూద్ గురించి చెప్పాలంటే.. కరోనా రాకముందు, కరోనా వచ్చాక.. అని మొదలుపెట్టాలి. కరోనా సమయంలోనే సోనూసూద్ రియల్ హీరో అయ్యాడు. అప్పటివరకూ రీల్ విలన్ గా ఉన్న సోనూసూద్.. కరోనా బాధితులకు సహాయం చేసి రియల్ లైఫ్ హీరోగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. CM చంద్రబాబే కాదు.. పలువురు సీఎంలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోనూసూద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news