లియో సినిమాలో హీరోయిన్ త్రిషను రేప్ చేసే సీన్ లేకపోవడంతో బాధపడ్డానన్న నటుడు మన్సూర్ ఆలీఖాన్ వాక్యాలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ మాళవిక మోహన్, సింగర్ చిన్మయి, నిర్మాత అదితితో పాటు పలువురు నటీమణులు, దర్శకులు అతని కామెంట్స్ ను ఖండించి, త్రిషకు మద్దతుగా నిలిచారు. అలీఖాన్ వాక్యాలు అతడి నీచపు సాంస్కృతికి నిదర్శనం అని మండిపడ్డారు. మన్సూర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక… ఈ సంఘటనపై మంత్రి ఆర్కే రోజా కూడా స్పందిచారు.
మన్సూర్ ఆలీ ఖాన్ లాంటి మగాళ్లు మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. “ఆడవాళ్ళ గురించి మగాళ్లు అసభ్యకరంగా మాట్లాడినప్పుడల్లా వారిపై కఠినంగా, చట్టపరమైన పోలీస్ చర్యలు తీసుకోవాలి. వాళ్లు నాపై దాడికి పాల్పడిన టిడిపి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, కుష్బూ నాపై వాక్యాలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ కావచ్చు.
కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని పక్షంలో ఈ మగాళ్లు ఇలాగే అస్సలు భయపడకుండా ఏదైనా మాట్లాడుతారు. మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసిన రాజకీయాల్లో, సినిమాల్లో ఎదిగి చూపించాం. ఇలాంటి మగాళ్ళను ఇతర మహిళలు కలిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి?” అని రోజా ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.