అన్ స్టాపబుల్ షో పై రోజా సంచలన వ్యాఖ్యలు..!

-

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో సక్సెస్ పొందిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న కూడా ముగింపుకు చేరువయ్యింది. ఇలాంటి సమయంలోనే అన్ స్టాపబుల్ షో పై ప్రముఖ సీనియర్ నటి, మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఆహా రాజకీయంగా కూడా సంచలనం రేపుతోంది. 1995లో ఎన్టీఆర్ ను ఎలాంటి పరిస్థితుల్లో గద్దె దింపాల్సి వచ్చిందో చంద్రబాబు ఆహా షోలో వివరించారు. ఈ విషయం కాస్త అటు రాజకీయంగా కూడా తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

ఇది జరిగి చాలా రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ షోపై ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాలలో సందడి చేసిన రోజా మీడియా ప్రతినిధులతో మాట్లాడి అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. చాలా ఘాటుగా స్పందించింది. షో కి వెళ్లే ఉద్దేశం తనకు లేదు అని చంద్రబాబు ఇంటర్వ్యూ చూశాక షో మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ షో కి పవన్ కళ్యాణ్ ను పిలుస్తుండడంతో ఆ షో కి వెళ్లాలని అస్సలు అనిపించడం లేదు అంటూ రోజా తెలిపారు. ముఖ్యంగా ఈ షోలు కూడా వారు డబ్బు కోసమే చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు అందులో వారు చెప్పేవి ప్రజలకు తెలియని నిజాలా? అని కూడా ఆమె ప్రశ్నించారు. మొత్తానికైతే అన్ స్టాపబులు షోలో బయటపడేవి ఏమీ లేవని ప్రజలకు వారి గురించి ముందే అంతా తెలుసు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఇకపోతే రోజా చేసిన కామెంట్లపై నటిజెన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version