దేశవ్యాప్తంగా నెం.1లో రాయల్ రామ్‌చరణ్.. దటీజ్ మెగా పవర్ స్టార్

-

కరోనా ధాటికి ఇంటికే పరిమితం కావాలని ఎవ్వరూ బయటకు రావొద్దని లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టాలంటే ప్రజలంతా సహకరించాలని, ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అనే నినాదాన్ని చాటిస్తూ.. అవగాహన కలిగిస్తున్నారు. సెలెబ్రిటీలు సైతం ఇంటి పట్టునే ఉంటూ.. తమ అభిమానులకు కూడా అదే సందేశాన్ని చెబుతున్నారు.

ఈ కమ్రంలో ఇంట్లోనే ఉండాలని, తన పుట్టిన రోజుకు ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని రామ్ చరణ్ కోరిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా అదే విషయాన్ని మరోసారి చెప్పాడు. తనకు అర్దరాత్ర నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయని, ఎంతో సంతోషంగా ఉందని, ఇంట్లోనే ఉండండని సురక్షితంగా ఉండండని అదే తనకు ఇచ్చే గొప్ప బహుమతి అని రామ్ చరణ్ మరోసారి వేడుకున్నాడు.

అయితే ఇంట్లోనే ఉంటూ తమ అభిమాన హీరో పుట్టిన రోజును దేశ మంతా వినిపించేలా చేస్తున్నారు అభిమానులు. రాయల్ రామ్ చరణ్ అంటూ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యేలా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ దెబ్బకు ట్విట్టర్ ట్రెండింగ్‌లో మొదటి, నాలుగు స్థానాల్లో రామ్ చరణ్ పేరే ఉంది. 1.06మిలియన్ల ట్వీట్లతో రాయల్ రామ్ చరణ్ టాప్ ప్లేస్‌లో ఉంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ దటీజ్ రామ్ చరణ్ అని కాలర్ ఎగిరేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news