సంచలన నిర్ణయం దిశగా జగన్…!

121

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎలా అయినా సరే కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలని పట్టుదలగా ఉన్న జగన్ సర్కార్ ఇప్పుడు తెలంగాణా తరహాలోనే మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉంది. లాక్ డౌన్ విధించినా సరే ప్రజలు బయటకు వస్తున్నారు.

దీనితో కర్ఫ్యూ విధించే దిశగా తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పుడు జగన్ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా వైరస్ అంటే జనాలకు భయం లేదని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని జగన్ యోచనలో ఉన్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో బడ్జెట్ సమావేశాలను కూడా నిర్వహించవద్దు అని జగన్ సర్కార్ భావిస్తుంది. మూడు నెలల నిధులకు సంబంధించిన ఆర్డినెన్స్ ని వోట్ ఆన్ ఎకౌంటు ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కేసులు ఏపీ లో 11 కి చేరాయి. ఎవరికి ప్రాణాపాయం లేదు.