కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’…. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 223 కోట్లు వసూలు

-

ప్రపంచ వ్యాప్తంగా ‘ ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న సినిమా కావడంతో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్ వర్క్ చేసింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ మార్చి 25న థియేటర్లలో భారీస్థాయిలో విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే గతంలో ఉన్న రికార్డులను తిరగరాస్తోంది ట్రిపుల్ ఆర్.

ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ప్రకారం ట్రిపుల్ ఆర్ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 223 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ మొదటి రోజు కలెక్షన్లు రికార్డులను బద్దలు కొట్టిందిా.  బాహుబలి-2 ని అధిగమించింది… ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇండియన్ సినిమాల్లో నంబర్ 1 ఓపెనర్ అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు గ్రాస్ రూ. 223 కోట్లు కొల్లగొట్టిందని.. రాజమౌళి తనతో తానే పోటీ పడుతున్నాడు అని తరుణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.

ఏపీలో రూ. 75 కోట్లు, నైజాం రూ. 27.5 కోట్లు, కర్ణాటక రూ. 14.5 కోట్లు, తమిళనాడు రూ. 10 కోట్లు, కేరళ రూ. 4 కోట్లు, నార్త్ ఇండియా రూ. 25 కోట్లు, మొత్తంగా భారతదేశంలో రూ. 156 కోట్లు, యూఎస్ఏలో రూ. 42 కోట్లు, నాన్ – యూఎస్ రూ. 25 కోట్లు మొత్తంగా రూ. 223 కోట్లు వసూలు చేసిందని.. అంతకుముందు బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రూ. 217 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version