ముంబైలో ఆర్ఆర్ఆర్ బిగ్ ఈవెంట్..ముఖ్య అతిథిగా సల్లు బాయ్..!

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్ ను ముంబై లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత ధర్మ ప్రొడక్షన్ అధినేత కరణ్ జోహార్ హాజరయ్యారు. హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్, ముద్దుగుమ్మలు ఒలివీయా మోరిస్, అలియా భట్ మరియు దర్శకుడు జక్కన్న ఈవెంట్ కు హాజరయ్యారు. అంతే కాకుండా సినిమా లో కీలక పాత్రలో నటించిన శ్రీయ కూడా ఈవెంట్ లో సందడి చేసింది. ఇక ఈ ఈవెంట్ ను లైవ్ లో ప్రసారం చేయలేదు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోల్లో ఒకే ఒక్క ఫోటోను ఆర్ ఆర్ ఆర్ సోషల్ మీడియా టీమ్ పోస్ట్ చేసింది.