నేటి నుంచి వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అయితే ఈ వారం రోజుల పాటు దేశ వ్యాప్తం గా ప్రజల నుంచి వచ్చే ఫీర్యాదులను పరిష్కరిస్తారు.
ఈ రోజు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతే కాకుండా గుడ్ గవర్నెన్స్ వీక్ పోర్టల్ ను కూడా ప్రారంభిస్తారు. వారం రోజుల తర్వాత అంటే డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి రోజున ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గుడ్ గవర్నెన్స్ వేడుక ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అలాగే ఈ గుడ్ గవర్నెన్స్ పై స్పందిస్తు దేశ ప్రజలకు సుపరిపాలనను ఇవ్వడమే తమ లక్ష్యం అని ప్రకటించారు.