ఇండియాలో 150 దాటిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. వేగంగా అన్ని ప్రాంతాలకు ఓమిక్రాన్ విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్ లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. తాజాగా ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 151 కి చేరింది. తాజాగా మహారాష్ట్రలో మరో 6 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో దేశంలో ఓమిక్రాన్ కేసులు సంఖ్య 150 దాటింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో ఓమిక్రాన్ విధ్వంసం కలిగిస్తోంది. ఎక్కడా లేనట్టుగా ఈ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు హాఫ్ సెంచరీని దాటాయి. దేశంలో రాష్ట్రాల వారీగా ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే…మహారాష్ట్ర (54), ఢిల్లీ (22), రాజస్థాన్ (17) మరియు కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (9), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) ) మరియు పశ్చిమ బెంగాల్ (1) గా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిమాలో నమోదవుతున్న కేసులన్నీ.. విదేశాల నుంచి వచ్చినవే. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, సోమాలియా, యూకే దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారిలోనే ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.