రాజమౌళి సంచలన నిర్ణయం…త్వరలోనే రానున్న RRR సీక్వెల్ !

-

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల బాహుబ‌లి రికార్డుల‌ను చెరిపివేసింది ట్రిపుల్‌ ఆర్. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్ల పరంగా 710 కోట్లకు పైగా రాబట్టిన ట్రిపుల్ ఆర్.. ఒవరాల్‌గా బాహుబలి రికార్డ్స్‌ను బద్దలు కొడుతుందా.. అంటే ఖచ్చితంగా చెప్పలేమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

కానీ బాహుబలి తర్వాత రాజ‌మౌళి నుంచి వచ్చిన సినిమా కావడంతో.. ట్రిపుల్ ఆర్‌కు తిరుగులేదని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా వచ్చిన ఈ సినిమాలో.. తార‌క్‌, చ‌ర‌ణ్‌ల న‌ట‌న‌ను చూసేందుకు.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ప్ర‌తి సినీ ప్రేక్ష‌కుడు ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ సీక్వెల్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్.. ట్రిపుల్ ఆర్ సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ 2 వచ్చే ఛాన్స్‌ ఉందా అని ప్రశ్నించగా.. ఉండవచ్చనే సమాధానం ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్‌. దీంతో ట్రిపుల్‌ ఆర్‌ సీక్వెల్‌ కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు సినీ ప్రముఖులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version