స రి గ మ ప ఛాంపియన్షిప్ ఎ.ఆర్.రెహమాన్ స్పెషల్ ఎపిసోడ్ ఈ ఆదివారం మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 08 మార్చి: అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న షో జీ తెలుగు స రి గ మ ప ఛాంపియన్షిప్. మైమరపించే పాటలతో, సరదా సంభాషణలతో సంగీతాభిమానులతోపాటు అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం స రి గ మ ప ఛాంపియన్షిప్ ఈ వారం మరో ప్రత్యేక ఎపిసోడ్తో మీ ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ స్వరపరచిన పాటలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు నవీన్ ఈ కార్యక్రమంలో తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేయనున్నారు. స రి గ మ ప ఛాంపియన్షిప్ ఎ.ఆర్.రెహమాన్ స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం, 12 మార్చి 2023, రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

వారం వారం ఆకట్టుకునే ప్రదర్శనలతో పాటు అలరించే వినోదంతో అందరికీ చేరువైన సరిగమప ఛాంపియన్షిప్ ఈ వారం మరిన్ని మైమరపించే విశేషాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవర్గ్రీన్ హిట్ ముఖాబులా పాటతో ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్, మెంటర్ల అదిరిపోయే ఎంట్రీతో షో ప్రారంభమవుతుంది. ఫ్లూటిస్ట్ నవీన్ వేణుగానంలో రెహమాన్ పాటలు మరింత మనోహరంగా సాగిపోయి అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. అంతేకాదు రెహమాన్తో తన అనుభవాలను వివరిస్తూ జ్ఞాపకాలను పంచుకున్నారు నవీన్.

ఎపిసోడ్ మొత్తం రెహమాన్ స్వరపరచిన హిట్ సాంగ్స్తో సాగుతుంది. కంటెస్టెంట్స్, మెంటర్స్, వాయిస్ ట్రైనర్స్తోపాటు జడ్జి మనో కూడా నవీన్ వేణుగానంతో కలిసి రెహమాన్ పాటలను పాడి అలరిస్తారు. శశాంక్, ప్రకృతి రెడ్డి ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇక, ఎప్పటిలానే సాకేత్, ప్రదీప్ మధ్యసాగే సరదా సంభాషణ, జడ్జీల పంచులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒకే ఒక్కడులోని అందాల రాక్షసివే పాటని డానియల్‌– ‌ ‌‌సాయి వల్లి శివాని, బాయ్స్ సినిమాలోని ఆలే ఆలే పాటని యశస్వీ – ప్రజ్ఞ, సాహసం శ్వాసగా సాగిపో సినిమా నుండి చక్కోరి పాటని శ్రీనివాస్ – దివ్య మల్లిక, కడలి నుండి పచ్చని తోట పాటని శశాంక్– ప్రకృతి రెడ్డి పాడి అలరించనున్నారు.
ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు స రి గ మ ప ఛాంపియన్‌షిప్ – ఎ. ఆర్. రెహమాన్ స్పెషల్ ఎపిసోడ్‌ తప్పక చూడండి. మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Exit mobile version