సుప్రీం హీరో గాంజా శంకర్ గ్లింప్స్ రిలీజ్.. ఊరమాస్ లుక్​లో సాయిధరమ్ తేజ్

-

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమా ఎంపికల్లో దూకుడు చూపిస్తున్నాడు. ఇటీవలే బ్రో సినిమాతో అదరగొట్టిన ఈ హీరో తాజాగా మరో చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. సాయిధరమ్ ​తేజ్ – దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇవాళ ఈ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా.. మూవీటీమ్ అధికారికంగా సినిమా టైటిల్​ను అనౌన్స్​ చేసింది. అదే విధంగా చిన్న గ్లింప్స్ వదిలింది. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అనే పేరును ఖరారు చేస్తూ.. వీడియో గ్లింప్స్​ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. లోకల్ మ్యాన్​గా తేజ్.. ఊరమాస్ లుక్​లో అదరగొట్టాడు.

‘ఆడు సిన్నప్పుడే సదువు బంజేసిండు.. అమ్మానాయనలు చెప్తే వినుడు లేదు.. అడ్డమైన తిరుగులన్నీ తిరుగుతడు.. ఇక జర్దాలు.. సరదాలు.. గుట్కాలు.. తాగుడు.. మన్ను మశానం వానికి లేని దరిద్రపు అలవాటు లేదు’….. ‘పదుంటే పార్కులో పంటడు.. పది వేలుంటే పార్క్ హయాత్​లో ఉంటడు’.. అంటూ హీరో ఇంట్రడక్షన్ డైలాగ్స్ కూడా ఊరమాస్​గా ఉన్నాయి. మరి మీరూ ఈ గ్లింప్స్ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news