చంద్రబాబుకు హానీ జరిగితే నాతో సహా వైసీపీని తగలబెట్టేస్తారు – రఘురామ

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు పొరపాటున ఏదైనా హాని జరిగితే తనతో సహా తమ పార్టీ నాయకులందరినీ ప్రజలు తగలెట్టేస్తారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి హాని కల్పించవద్దని, అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదని ప్రభుత్వ పెద్దలకు రఘురామకృష్ణ రాజు గారు హితవు పలికారు.

గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు చంచల్ గూడ జైల్లో సకల రాజభోగాలు అనుభవించారని, ఎన్ని ఐస్ క్రీములు తిన్నారో… ఇంకా ఏమేమి చేశారో తెలుసుని, చంద్రబాబు నాయుడు గారికి జైల్లో తగిన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఎలాగో బుధవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన జైలు నుంచి విడుదల కావడం ఖాయమని అన్నారు. జైలులో తనకు జరిగిన అన్యాయమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జరగవద్దని… తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news