ఆ సీన్ నేను మర్చిపోలేను..సాయి పల్లవి..!

-

‘ ప్రేమమ్ ‘ అనే మలయాళీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయి పల్లవి. ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కి అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి. తెలుగు, తమిళ్, మలయాళీ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయి పల్లవి. తెలుగులో ఈమె చేసిన ఫిదా సినిమా, ఈ చిత్రం లో సాయి పల్లవి నటన, భానుమతి హైబ్రిడ్ పిల్ల అంటూ ఆమె పలికిన తెలంగాణ తెలుగు ప్రేక్షుల్ని అలరించింది.

సాయి పల్లవి మాతృభాష మలయాళీ అయినప్పటికీ ఫిదా సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పింది. అది కూడా స్వచ్చమైన తెలంగాణా యాస తో చాలా బాగా డబ్బింగ్ చెప్పింది సాయి పల్లవి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాలో ట్రాక్టర్ నడిపే సన్నివేశం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. సినిమాలో అదేంటంటే హావభావాలను తన మోహంలో సహజంగా చూపించే సాయి పల్లవి తాను ట్రాక్టర్ నడిపే సీన్ తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని అంది.

ట్రాక్టర్‌ను మాములుగా నేర్చుకుని రోడ్డుపై నడపడం వేరు,దమ్ము వీల్స్ తో బురుద పొలంలో ట్రాక్టర్ నడపడం వేరు అలా ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావాలతో నటించడానికి చాలా కష్టపడినట్టు చెప్పింది. ఈ సీన్ చేసే సమయంలో నన్నునేను నియంత్రణ కోల్పాయానని తెలిపింది. ఇది తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని ‘ఫిదా’ సినిమా రోజులను గుర్తు చేసుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం రానాతో కలిసి ‘విరాటపర్వం’ అనే సినిమా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నట్టు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version