‘సలార్‌’లో ప్రభాస్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే వీడియోలో.. చూసేయండి మరి

-

థియేటర్లో విడుదలై.. ఓటీటీలోకి వచ్చినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్‌’ మూవీ జోరు ఇంకా తగ్గలేదు. ఏదో రకంగా ఈ సినిమాకు సంబంధించిన సంగతులు నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మీమర్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్కు మాత్రం ఓ కంప్లెయింట్ ఉంది. అదేంటంటే..? ఈ చిత్రంలో ప్రభాస్కు ఎక్కువగా డైలాగ్స్ లేకపోవడం.

తాజాగా సలార్ సినిమా మొత్తంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అన్నింటితో కూడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నిడివి మొత్తం 2.35 నిమిషాలు ఉంది. అసలైతే మూవీలో ప్రభాస్ డైలాగ్స్ నిడివి దాదాపు నాలుగు నిమిషాలు ఉంటుంది. కానీ ఈ వీడియో రూపొందించిన వ్యక్తి మాత్రం దాన్ని 2.35 నిమిషాలకు కుదించాడు. ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఖాన్సార్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైన హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news