నేడు టీవీలోకి వ‌స్తున్న టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘స‌లార్’

-

బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరుస ఫ్లాప్లతో సతమతమైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్‌’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే టీవీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 21న ఆదివారం అంటే ఇవాళ స్టార్ మా లో సాయంత్రం 5.30 నుంచి స‌లార్ ప్రీమియ‌ర్ కానున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది. ఇది తెలిసి రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మరోసారి ఈ చిత్రాన్ని చూస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ‘సలార్‌-పార్ట్‌-1 సీజ్‌ఫైర్‌’ పేరుతో విడుదల చేయగా, రెండో భాగానికి ‘సలార్‌-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version