చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు

-

హైదరాబాద్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్ అయ్యారు. చికిత్స చేసి ఆ మేకులను పొట్టలో నుంచి తొలగించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆ ఖైదీకి మెరుగైన వైద్యం అందించి కాపాడారు.

చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహ్మద్‌ షేక్‌ (32)కు నాలుగు రోజుల క్రితం ీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు వైద్యుల సిఫార్సు మేరకు అతడిని గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. డాక్టర్లు  ఎక్స్‌రేలు తీయించి పరిశీలించగా ఖైదీ కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు కనిపించింది. అది చూసి వైద్యులు షాకయ్యారు.

గ్యాస్టో ఎంటరాలజీ విభాగాధిపతి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో శనివారం మళ్లీ వైద్యపరీక్షలు చేసి.. రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను బయటకు తీశారు. సుమారు 2 -2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని జైలు వర్గాలు తెలిపాయి. అందుకు కారణాలేమిటో ఆరా తీస్తున్నామని వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version