అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ సాంగ్పై స్టెప్పులేసిన బాలీవుడ్ ఖాన్స్

-

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకల్లో సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖలు పాల్గొన్నారు. దేశవిదేశాల నుంచి అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుకకు బాలీవుడ్‌ స్టార్ హీరోలు సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్ కూడా హాజరయ్యారు. వీరి ముగ్గురు ఒక చోట కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్‌లో ఫేమస్‌ పాటలకు డ్యాన్స్‌ వేసి అలరించారు. ఇందులో భాగంగానే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటునాటుకు ముగ్గురు ఖాన్లు స్టెప్పులేశారు. ఆతర్వాత వారి సినిమాల్లో పాటల హుక్‌ స్టెప్‌లను రీక్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news