మేడిగడ్డ ఎఫెక్ట్..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రమాదంలో పడింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం ప్రాజెక్టుపై మేడిగడ్డ ప్రాజెక్టు ఎఫెక్ట్ పడింది.మరో రెండు నెలల్లో రామగుండం ఎరువుల కర్మాగారానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సమాచారం. ఈ తరుణంలోనే మే నెల నుంచి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారట.
శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా 0.55 టీఎంసీలు ఆర్.ఎఫ్.సీ.ఎల్ కు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి.మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఇరిగేషన్ అధికారులను కలిసి నీటిసరఫరా కొనసాగించాలని కోరారు ఆర్.ఎఫ్.సీ.ఎల్ అధికారులు. ఇప్పటికే బాయిలర్ ట్యూబ్ ల లీకేజీలతో యూరియా ఉత్పత్తికి ఆటంకాలు వచ్చి పడ్డాయి. నీటి కొరత ఏర్పడితే 3 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడే అవకాశం ఉందట.