ఓటీటీలోకి ‘సామజవరగమన’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో మంచి టాక్ సంపాదించుకున్న చిత్రం సామజవరగమన. చిన్న చిత్రమైనా.. ప్రేక్షకులను పెద్దగా అలరించింది. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను కడుపుబ్బ నవ్వించింది. వినోదాత్మక చిత్రంగా అలరించిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నరేష్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలకపాత్రలు పోషించారు.

ఇదీ స్టోరీ : బాలు (శ్రీవిష్ణు) ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. సంపాదించే ప్ర‌తి రూపాయిని జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టే స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం త‌న‌ది. తండ్రి ఉమా మహేశ్వ‌ర‌రావు (న‌రేష్‌)ను డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్ప‌లు ప‌డుతుంటాడు. ఎందుకంటే ఆయ‌న డిగ్రీ పూర్తి చేస్తేనే త‌న తాత వీలునామా ప్ర‌కారం కోట్ల రూపాయ‌ల ఆస్తి చేతికొస్తుంది. ఆయ‌న డిగ్రీ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసే క్ర‌మంలో స‌ర‌యు (రెబా మోనికా జాన్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఆమె పేయింగ్ గెస్ట్‌గా బాలు ఇంట్లోకి అడుగు పెడుతుంది. బాలు.. స‌ర‌యుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి ఓ ప్ర‌ణాళిక కూడా ర‌చిస్తారు. అయితే త‌న‌ బావ పెళ్లి బాలుకు ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య తెచ్చిపెడుతుంది. మ‌రి ఆ స‌మ‌స్య ఏంటి? త‌న‌ బావ పెళ్లికి.. బాలు- స‌ర‌యు ప్రేమ‌క‌థ‌కు ఉన్న లింకేంటి? వీళ్ల ప్రేమ క‌థ చివ‌ర‌కు ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాసై త‌న ఆస్తి ద‌క్కించుకున్నాడా? లేదా? అన్న‌వి తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news