ఏం మాయ చేసావే సినిమా లో సున్నితమైన భావోద్వేగాల ను పలికించే హుందా అయినా డిఫరెంట్ క్యారెక్టర్ ద్వారా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫస్ట్ సినిమా యే అలాంటి కారెక్టర్ చేయటం కష్టసాధ్యమైన పని. అటువంటి క్యారెక్టర్ లో లీనమై నటించడం అది కూడా మొదటి సినిమాలో ఎవరి వల్ల కాదు. కానీ అటువంటిది తనలో ఉన్న టాలెంట్ ద్వారా మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మాత్రమే కాదు ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల దృష్టిలో పడింది.
ఇలా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సమంత అక్కినేని వారి ఇంటికి కోడలు అయింది. సినిమా రంగంలో చాలా తక్కువమంది హీరోయిన్లు మాత్రమే సాటి నటుడి నీ పెళ్ళాడి ఆ తరువాత వారితో నటించి విజయం సాధించగలిగారు. అలాగే చైతూ తో వివాహం జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించి సమంత విజయం సాధించింది. అటువంటి సమంత నేటితో 32 ఏళ్లు ముగించుకుని 33వ వసంతంలోకి అడుగు పెట్టింది. సినిమా రంగంలో ఎలాంటి పాత్ర అయినా చేయగల సమంత నీ చాలామంది తెలుగునాట మరొక శ్రీదేవి గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో చాలా మంది సెలెబ్రిటీస్ మరియు అభిమానులు సమంత కి బర్త్ డే విషెస్ చెబుతూ హోరెత్తిస్తున్నారు.