టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటిదాక ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సామ్ తాజాగా ఇండోనేషియాలోని బాలి దీవికి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో హాలిడే జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో కసరత్తులు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోంది.
బాలిలో తన స్నేహితురాలు అనూషతో కలిసి సమయాన్ని గడుపుతూ చిల్ కొడుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. అలా అక్కడి అందాలను, అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె ఐస్ బాత్ టబ్ అంటూ వీడియోను షేర్ చేసింది. ‘ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్’ అంటూ.. ఆరు నిమిషాల పాటు ఆ ఐస్ నీళ్లలో కఠినంగా కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కూడా వస్తున్నట్టు కనిపించంది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.