ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి చెక్ పెట్టి గెలవాలని చెప్పి టిడిపి బాగానే కలలు కంటుంది. వాస్తవానికి గుడివాడ టిడిపి కంచుకోట. 2009 వరకు అక్కడ టిడిపి హవా నడిచింది. ఎప్పుడైతే కొడాలి వన్ మ్యాన్ షో మొదలైందో..అప్పటినుంచి గుడివాడ కాస్త కొడాలి అడ్డాగా మారిపోయింది. 2004, 2009 ఎన్నికల్లో కొడాలి గుడివాడ నుంచి టిడిపి తరుపున గెలిచారు.
ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైసీపీ నుంచి గెలవడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని సర్వేలు వచ్చిన గుడివాడలో కొడాలి గెలుపు ఆపడం కష్టమనే తేలిపోయింది. అయితే గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడానికి టిడిపి నానా కష్టాలు పడుతుంది. పైగా అక్కడ టిడిపి అభ్యర్ధి ఎవరనేది క్లారిటీ లేదు. ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..అటు వెనిగండ్ల రాము సైతం టిడిపి సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య సీటు కోసం పోటీ నెలకొంది.
ఇదే సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరు గుడివాడ బరిలో దిగుతారని ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య నందమూరి సుహాసిని పోటీ చేస్తారని ప్రచారం చేశారు. మధ్యలో తారకరత్న పోటీ చేస్తారని, నందమూరి చైతన్య కృష్ణ పోటీ చేస్తారని రకరకాలుగా కథనాలు వచ్చాయి. తారకరత్న మరణం తర్వాత ఆ కథనాలకు కాస్త బ్రేక్ పడింది.
ఇప్పుడు నారా రోహిత్ పోటీ చేస్తారని ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవలే ఆయన ఏపీ రాజకీయాలపై ప్రతినిధి-2 సినిమా తీస్తున్నారు. దీంతో రోహిత్ గుడివాడ బరిలో ఉంటారని, ఇంకా కొడాలికి చెక్ పడిపోతుందని టిడిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అయితే అక్కడ కొడాలిపై ఎవరు పోటీ చేసిన ఉపయోగం లేదు. ఆఖరికి చంద్రబాబు వచ్చి పోటీ చేసిన గుడివాడలో కొడాలిదే గెలుపు.