సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కావాల్సింది. కాని లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇక ఖుషి సినిమా విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. సమంత ను తీసి కొత్త హీరోయిన్ ను పెట్టబోతున్నారు అని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. దీనిపై యూనిట్ వర్గాలు ఎవరూ ఖండించడం కూడా చేయలేదు. ఇక రీసెంట్ గా సమంత వర్క్ అవుట్ చేస్తూ ఫిట్ గా మారేందుకు తనని తాను మలచు కొంటోంది.

తాజాగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చిత్ర షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ను ఇచ్చారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభిస్తాం అని అన్నారు. ఇక భవిష్యత్ బ్యూటి ఫుల్ గా ఉండ బొతుంది అంటూ ఆనందంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.తాజాగా ఈ ఆలస్యం కు సమంత సోషల్ మీడియాలో చిట్ చాట్ లో క్షమాపణ చెప్పింది. ఎందుకు ఇంత ఆలస్యం అని అభిమాని అడగగా ఖుషీ చిత్రం త్వరలోనే పునః ప్రారంభం అవుతుంది అని తెలిపింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి క్షమాపణలు అంటూ రిప్లై ఇచ్చింది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?