సమంత తన స్టామినా చూపించిందా? మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అనతికాలంలోనే బోల్డ్ పాత్రల్లో సైతం నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే వివాహం చేసుకొని నాగచైతన్యతో సంతోషంగా ఉన్న సమయంలో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక విడాకులు అనంతరం సినిమాల పైన దృష్టి పెట్టిన ఈమె ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం తాను లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించిన యశోద సినిమాలో నటించి సినిమాను విడుదల చేయడం జరిగింది. శుక్రవారం సౌత్ ఇండస్ట్రీలో భారీగా విడుదలైన ఈ సినిమా హిందీలో కొన్ని లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదల చేశారు.

మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న యశోద సినిమా ఉదయం షోలకంటే సాయంత్రం, నైట్ షోలకే కాస్త ఎక్కువ కలెక్షన్ వచ్చిందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో హరి హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ యశోద సినిమా కు దాదాపుగా రూ.40 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. కానీ అసలు ఆ రేంజ్ లో అయితే సినిమాలో బడ్జెట్ పెట్టినట్లు కనిపించలేదు అని ఒక వర్గం నుంచి టాక్ కూడా వినిపిస్తోంది . ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..

యశోద సినిమాను తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగులో మొదటి రోజు రూ.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. హిందీలో రూ.10 లక్షలు రాబట్టిన ఈ సినిమా.. తమిళంలో మరో రూ.10 లక్షలు వసూలు చేసింది అలాగే మలయాళంలో రూ.9 లక్షల వరకు మాత్రమే వసూలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఇటుగా ఈ సినిమా ఇండియాలో రూ.3 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో చూసుకుంటే దాదాపు రూ.80 లక్షల రాబట్టిన యశోద చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది అయితే సమంత స్టామినా ప్రకారం ఈ సినిమా అంత కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. మొత్తానికి అయితే సమంత ఈ సినిమా ద్వారా తన స్టామినా నిరూపించుకోలేకపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version