‘సిటడెల్’ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన సమంత

-

వరుణ్‌ధావన్‌, సమంత జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్‌ తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది సమంత.

రాజ్‌ అండ్‌ డీకే, వరుణ్‌ధావన్‌తో కలిసి ‘సిటాడెల్‌’ రషెస్‌ చూశాను. అంతేకాదు, సిరీస్‌లో నా పాత్రకు డబ్బింగ్‌ కూడా మొదలు పెట్టాను. అంటూ స్టూడియోలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది సమంత. ఈ సిరీస్ కోసం సామ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇందులో సామ్, వరుణ్ కలిసి చేసే యాక్షన్ అదిరిపోతుందని టాక్. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన విషయం తెలిసిందే. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news