సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ గ్లింప్స్ రిలీజ్

-

సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సమంత నెమ్మదిగా వర్క్ మోడ్లోకి అడుగుపెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్సిరీస్ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈ ఈవెంట్స్కు హాట్ హాట్ ఔట్ఫిట్స్లో కనిపిస్తూ మతి పోగొడుతోంది. తాజాగా ఈ భామ నటించిన ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర బృందం. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించింది.

ఫ్యామిలీ మెన్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను తెరకెక్కించారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి సమంత ఈ సిరీస్లో నటించింది. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రలో ఇక్కడ సమంత నటించింది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్తో ఆకట్టుకుంటోంది. మరోసారి యశోద చిత్రం తర్వాత సామ్ ఈ సిరీస్లో యాక్షన్ పాత్రలో సందడి చేసింది. సామ్ ఇన్ ఫుల్ యాక్షన్ మోడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version