Samantha: విడాకుల అనంత‌రం అక్కినేని కాంపౌండ్‏లో సమంత.. ఎందుకంటే..

-

Samantha: అక్కినేని న‌టవార‌సుడు నాగ చైత‌న్య‌, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేండ్ల త‌మ వివాహా బంధానికి అంతిమంగా వీడ్కోలు చెప్పడంతో అటు అక్కినేని ఫ్యాన్స్ , ఇటు సామ్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. తొలుత వారి విడాకుల విషయాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేదు. అంత అబ‌ద్ద‌మే న‌నీ అనుకున్నారు. కానీ, ఇద్దరు కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో షాక్ గురయ్యారు.

ఆ తరువాత‌.. ఎవ‌రి కేరీర్ పై వారు ఫోక‌స్ పెట్టారు. ఈ క్ర‌మంలో స‌మంత .. తన ఫిట్‏నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోస్‏ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త‌నకు న‌చ్చిన‌ క్రేజీ ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ క్ర‌మంలో స‌మంత మొదటి సారి అక్కినేనివారి కాంపౌండ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న త‌రువాత.. తొలి సారి అన్నపూర్ణ స్టూడియోలో కాలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్, స‌మంత కాంబోలో తెర‌కెక్కిన చిత్రం శాకుంతలం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే.. ప్ర‌స్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సమంత‌ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లిందట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. దీంతో అన్న‌పూర్ణ స్టూడియోలో కాలు మోప‌క త‌ప్ప‌లేదంట . ఇదిలా ఉంటే… చైతూ బ‌ర్త్ డే నాడు సామ్ విషెస్ చేయకుండా.. తన కుక్క పిల్లకు బర్త్ డే వేడుకలు జరపడం పై చైతూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సమంత ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. . అందుకోసం ఆమె రెండు కోట్ల వరకు కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా సమంత పెళ్లి తర్వాత అన్నిరకాల కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news