సమంత కమిట్ మెంట్ సూపర్ గురూ..!!

-

సినిమా ప్రపంచం తో పరిచయం వున్న వారికి సమంత గురించి పరిచయం అక్కరలేదు. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమాలు తగ్గించిన సమంత, నాగ చైతన్య తో విడాకుల తర్వాత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ వుంటోంది. ఇంకో రెండు సంవత్సారాల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవంటే తన జోరు ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.

సమంత  ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా 11-11-2022 నాడు థియేటర్లలో  విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సమంత లేకపోవడం సినిమా యూనిట్ వర్గాలు వారే సొంతంగా ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా నిర్మాత తెలుగులో ఎన్నో  మంచి సినిమాలు తీసిన శివలెంక కృష్ణప్రసాద్ గారు. ఈయన రీసెంట్ గా యశోద సినిమా విషయాల గురించి మాట్లాడారు.

వాస్తవానికి ముందు ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు అనుకున్నామని కాని తర్వాత సినిమా కాన్సెప్ట్ పాన్ ఇండియా లాగా వుందని సమంత ను అడిగామని తెలిపాడు. సామ్ ఫస్ట్ సిట్టింగ్ లోనే సినిమాను ఒకే చేసిందని తెలిపారు. అలాగే సినిమాను లేడీ ఓరి యెంటెడ్ అయినా కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచి సెట్స్ వేసి తీశామని చెప్పుకొచ్చారు. అలాగే తమిళ డబ్బింగ్ హాస్పిటల్ బెడ్ మీద వుండి డాక్టర్స్ పర్యవేక్షణలో చెప్పినట్లు, సినిమా పట్ల తన కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అని తెలిపారు. సినిమా సూపర్ గా వచ్చిందని ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో వున్నామని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version