ముద్దులతో ఆ లాభాలు ఎక్కువే..ఒకసారి చేస్తే వదలరు..

-

పెదాలపై మరొక పెదాలు రాసే ప్రేమ లేఖనే అందరు ముద్దు అంటారు..ఈ విషయం ముద్దు రుచి చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు..ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి… తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. నేటితో వాలెంటైన్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ వారం రోజుల్లో కీలకమైనది కిస్ డే. ఈరోజు ప్రేమికుల మధ్య ముద్దు, మురిపాల ముచ్చట్లు జరుగుతాయి. ఇక మనలో కిస్ అనగానే అర్జున్ రెడ్డి, RX100 సినిమాలే కళ్ల ముందు కనిపిస్తాయి.

మనలో చాలా మంది సింగిల్ గా ఉండే వారికి ఇలాంటి డైలాగులు ఎక్కువగా చెబుతుంటారు. ‘ముద్దూ ముచ్చట.. ముద్దూ మురిపెం లేని జీవితం’ ఎందుకు అంటూ ఉంటారు. ఎందుకంటే రొటీన్, యాంత్రికంగా తయారైన మన జీవితంలో అప్పుడప్పుడూ ముద్దు, మురిపెం వంటివి ఉంటేనే చాలా థ్రిల్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రేమను చాటి చెప్పేందుకు ఉండే అద్భుతమైన సాధనాల్లో కిస్ చాలా ముఖ్యమైనది..

ఇకపోతే ముద్దుల్లో చాలా రకాలున్నాయి. వాటిలో సినిమాల్లో చూపినట్టు గాల్లో ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చుకోవడం.. దగ్గరగా ఉన్నవారు బుగ్గపై కిస్ చేసుకోవడం.. నుదుటిపై ముద్దు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇంకా కొందరు అర్జున్ రెడిని సినిమాని ఆదర్శంగా తీసుకుని నేరుగా లిప్ లాక్ కోసం ట్రై చేస్తారు. అయితే కిస్ అనేది ఎలా పెట్టినా కూడా ప్రేమికుల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఆ సమయంలో ఇద్దరిలోనూ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది..దాంతో ఎమైనా జరగొచ్చు.. అక్కడ ఆపడం కాస్త కష్టమే..అందుకే ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి..తొందరపడి కమిట్ అయితే ఇక అంతే..

Read more RELATED
Recommended to you

Exit mobile version