సందీప్ కిషన్ మజాకా టీజర్ వచ్చేసింది.. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడితే..!

-

హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మజాకా.  ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.  ప్రస్తుతం మజాకా సినిమా షూట్ జరుగుతుంది. ఈ సినిమాతో మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ రీ ఎంట్రీ ఇస్తోంది. అదేవిదంగా రీతూ వర్మ కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవడంతో వాయిదా పడింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని చూసినట్టయితే.. ఆర్.కే.బీచ్ లో కూర్చొని మందు కొడుతుంటే.. ఇద్దరినీ స్టేషన్ కి తీసుకొచ్చాం సార్ అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. అక్కడ పోసుకునేది బియర్ కాదండి నా ఉసురు. తెలియక అడుగుతున్నాను బియర్ బెటరా.. విస్కీ బెటరా.. అని హీరోయిన్ సందీప్ అడగ్గా.. రకుల్ బెటర్ రెజీనా బెటరా అంటే తాను ఏం చెబుతానని సమాధానం చెప్పారు. సందీప్ కిషన్, రావు రమేష్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ రీతూ వర్మతో ప్రేమలో పడితే.. రావు రమేష్ అన్ణు అంబానీతో ప్రేమలో పడినట్టు తెలస్తోంది. సందీప్ కిషన్ కి ఇది 30వ సినిమా. టీజర్ చూస్తుంటే కామెడీ ఎంటర్ టైనర్ గా తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Latest news