అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ఇంట్లో విషాదం

-

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఆయ‌న ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీంతో సందీప్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


సందీప్‌రెడ్డి వంగ తొలి సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా అర్జున్‌రెడ్డి రూపొందించారు. ఆ సినిమా ఇక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు రిలీజ్‌కు ముందే విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. పెద్ద సినిమాల‌కు లేని విధంగా రిలీజ్‌కు ముందు రోజే ప్రీమియ‌ర్ షోలు వేసి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.

ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సందీప్. షాహిద్ క‌పూర్ – కియారా అద్వానీ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా రూ.290 కోట్ల షేర్ రాబ‌ట్టింది.ఆయన ప్రస్తుతం తన తదుపరి చిత్ర స్క్రిప్ట్ పనులలో ఉన్నారు. ఆయన మహేష్ తో సినిమా చేయనున్నారని పలు వార్తలొస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన జరగలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version