సీటీమార్‌ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన గోపీచంద్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో గోపీ చంద్‌ హీరో గా సంపత్‌ నంది దర్శకత్వంలో సీటీమార్‌ మూవీ రూపొందింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ వారు ఈ సినిమా ను నిర్మించారు. కబడ్డీ నేపథ్యం లో ఈ కథ నడుస్తోంది. తమన్నా ఈ సినిమా లో గోపిచంద్‌ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. సౌందర రాజన్‌ కెమెరా పనితనం ఈ సినిమాకు హైలెట్‌ గా ఉండనుంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ విషయానికి వస్తే… మాస్‌ లుక్‌ లో హీరో గోపీ చంద్‌ అదరగొట్టాడు. తన దైన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కబడ్డీ ఆట చుట్టు ఈ సినిమా తిరుగనుందని ట్రైలర్‌ చూస్తే మనకు అర్థమౌతుంది. కబడ్డీ కోసం గోపీచంద్‌ ఎలాంటి రిస్క్‌ చేస్తాడనేదే ఈ సినిమాలో హైలెట్‌ కానుంది. కాగా… ఈ సినిమా సెప్టెంబర్‌ 10 అంటే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనుంది చిత్ర బృందం.