మ్యూచువల్ ఫండ్స్: హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏమిటి? దీనిలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందా?

-

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి దానిలో ఉన్న రకాలు కూడా తెలియాలి. ఏ రకమైన మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందన్న కనీస అవగాహన ఉండాలి. లేదంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉంటుంది పరిస్థితి.

ముందుగా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో మూడు రకాల ఫండ్లు కనిపిస్తాయి.

1.ఈక్విటీ
2.హైబ్రిడ్
3.డెట్

ఈక్విటీ అనగా కంపెనీ స్టాకుల్లో పెట్టుబడి పెడతారు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఇక డెట్ లో షార్ట్ టర్మ్ బాండ్స్, పేపర్స్ ఉంటాయి. వీటిల్లో రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువ. ఒక్కరోజులో ఇన్వెస్ట్ చేసి మరుసటి రోజు ఎలాంటి ఎక్సిట్ లోడ్ లేకుండా డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం ఇందులో ఉంటుంది.

ఇక మిగిలింది హైబ్రిడ్. నిజానికి హైబ్రిడ్ కూడా ఈక్విటీ అనే చెప్పుకోవచ్చు. ఇందులో ఈక్విటీ భాగం 65శాతం, డెట్ భాగం 35శాతం ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక్కో హైబ్రిడ్ ఫండ్ కి ఒక్కో నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ లలో పెట్టుబడి పెడుతుంది. కాకపోతే ఈక్విటీ పోర్షన్ ఎక్కడైనా ఎక్కువే ఉంటుంది.

ఇందులో పెట్టుబడి సరక్షితమా?

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు సురక్షితం గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఇందులో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని ముందే చెబుతారు. కానీ, హైబ్రిడ్ ఫండ్లలో డెట్ పోర్షన్ ఉంటుంది కాబట్టి, అక్కడ ఉండే పెట్టుబడికి రిస్క్ ప్రమాదం పెద్దగా ఉండదు. ఈక్విటీలో హై రిస్క్ అని అందరికీ తెలుసు. అంటే మీరు వంద రూపాయలు పెడితే అందులో 65రూపాయలు హై రిస్క్ లోకి వెళ్ళాయనుకుందాం. ఆ తర్వాత 35రూపాయలు డెట్ లోఖి వెళ్తుంది.

డెట్ లో ఉన్న 35శాతం కొంచెం సురక్శితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పట్ల పెద్ద రిస్క్ ఉండదు.

ఇందులో ఇన్వెస్ట్ మెంట్ ఎవరికి ఎక్కువ లాభదాయకంగా ఉండవచ్చు?

రిటైర్ అయిన వాళ్ళకి ఇది లాభదాయకంగా ఉండవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నెల నెలా కావాల్సినంత అమౌంటుని పొందే సౌకర్యం కూడా ఉంది.

గమనిక: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీముకి సంబంధించిన దస్తావేజులను జాగ్రత్తగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news