గంగూలితో ఎఫైర్ నిజమే.. సీక్రెట్ రివీల్ చేసిన నగ్మా..!

-

స్టార్ క్రికెటర్ మాజీ టీం ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన నగ్మా ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. నగ్మా చూపులకు గంగూలీ క్లీన్ బౌల్డ్ అని అప్పట్లో పెద్ద పెద్ద హెడ్డింగులతో ఆర్టికల్స్ వచ్చేవి. అయితే ఆ విషయం గురించి అప్పుడు నోరు విప్పని నగ్మా.. గంగూలిని ప్రేమించిన విషయాన్ని కన్ఫాం చేసింది.

 

అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారని తెలిసినా అతని ప్రేమలో పడ్డానని చెప్పిన నగ్మా గంగూలి కూడా తనని ఇష్టపడ్డాడని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి రెడీ అవుతున్న టైంలో ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పుడు ఆయన కెరియర్ మీద దృష్టి పెట్టాలని అనుకున్నారు అందుకే పెళ్లి వద్దనుకున్నాం అన్నది నగ్మా. ఇక ఇప్పుడు ఆ విషయాల గురించి పెద్దగా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పిన నగ్మా ఫైనల్ గా గంగూలితో ఎఫైర్ కన్ఫాం చేసింది.

ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న నగ్మా సిని, రాజకీయ రంగాల్లో తన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు తను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని.. మంచి వ్యక్తి దొరికితే పెళ్లాడేందుకు సిద్ధమే అంటుంది నగ్మా.

Read more RELATED
Recommended to you

Exit mobile version