టాలీవుడ్ ఒక హీరోయిన్ కి వరసగా నాలుగు హిట్లు పడ్డాయంటే ఇక ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ సినిమాకి కనీసం కోటి నుండి రెండు కోట్లు డిమాండ్ చేస్తుంటారు. అలా సంవత్సరం లో మూడు నుండి నాలుగు సినిమాలు చక చకా చేసేస్తారు. ఇవే కాదు భారీగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి ఆదాయాన్ని సంపాదించుకొని వెనకేసుకుంటారు. ఇక యాడ్ ఫిలింస్ అయితే చెప్పనవసరం లేదు. ఒక యాడ్ లో గట్టిగా రెండు నుండి మూడు రోజులు నటించి రెండు మూడు కోట్లు సంపాదించుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉన్న హీరోయిన్స్ రష్మిక మందన్న, పూజా హెగ్డే. వీళ్ళిద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్.
రష్మిక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేసి మంచి క్రేజ్‌ని సంపాదించుకుంటే పూజా హెగ్డే బన్నీ సరసన అలవైకుంఠపురంలో నటించి వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్లు దక్కించుకుంటుంది. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ జాన్ చిత్రంలో..అలాగే రెండు బాలీవుడ్ సినిమాలలో స్తుంది. ఇక పూజా సూర్య నటిస్తున్న మరో కోలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేసినట్లు సమాచారం. వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్ ప్రస్తుతం రెండుకోట్లు వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇక సమంత, తమన్నా, నభానటేష్ ఇలా టాలీవుడ్ హీరోయిన్లు వాళ్ళ కున్న క్రేజ్ ని బట్టి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం ఆర్ధికంగా కుదేలయిపోయింది. ఎంతో మంది పేద ప్రజలు ఆకలి కేకలు పెట్టే రోజులు వస్తాయోమే నన్న ఆలోచనలు ఇప్పటికే మొదలయ్యాయి.
దాంతో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ఇతర హీరోలు తమ వంతు బాధ్యతగా విరాళాలని ప్రకటించి పేదలకి అండగా నిలుస్తున్నారు. కాని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే ఒక లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దాంతో ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ హీరోయిన్స్ మీద వీళ్ళకి బాధ్యత లేదా కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు గాని పేదల బాధలు కష్టాలు కనిపించడం లేదా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.