విక్కీ బ్రో.. నయన్​తో కాస్త జాగ్రత్త.. విఘ్నేశ్​కు షారుక్ సలహా

-

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. తమిళ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్​కు ఓ సలహా ఇచ్చాడు. తన భార్య నయనతారతో జాగ్రత్తగా ఉండమని విక్కీకి సూచించాడు. ఇంతకీ షారుక్ అలా ఎందుకన్నాడో తెలుసా..?

షారుక్-నయన్ కలిసి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన విఘ్నేశ్ ఆనందం వ్యక్తం చేస్తూ.. వీడియో తనకెంతో నచ్చిందని ఆయన పోస్ట్‌ పెట్టాడు. ‘‘ఇలాంటి బిగ్గెస్ట్ చిత్రంతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. ట్రైలర్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్‌ కల నెరవేరింది. టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని విఘ్నేశ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

ఈ పోస్టుపై షారుక్ రియాక్ట్ అయ్యాడు. ‘‘విఘ్నేశ్‌.. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నయన్‌ అద్భుతమైన వ్యక్తి. మీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు కదా..!! ఇటీవల ఆమె కొన్ని కీలకమైన పంచ్‌లు నేర్చుకున్నారు. కాబట్టి జాగ్రత్త’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version