షారుఖ్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ పని మానేస్తున్నానని ప్రకటన

-

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో తనుకు ఉన్న చెడు అలవాటును తన పుట్టిన రోజు సందర్భంగా మానేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో చాలా సార్లు ఈ పని చేయాలని అనుకున్నట్లు కానీ తన వల్ల కాలేదని చెప్పుకొచ్చారు. ఈ సారి మాత్రం తప్పక ఆచరిస్తానని చెప్పారు.

నవంబర్ 2 షారుఖ్ ఖాన్ బర్త్ డే.. 1965లో ఆయన జన్మించారు. ఈ క్రమంలోనే తన బర్త్ డే సందర్బంగా ధూమపానం మానేస్తున్నట్లు ప్రకటించారు. ఓ ఈవెంట్‌లో భాగంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో ఆయన అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు. ‘ నాకు ఊపిరి ఆడదు అనుకున్నా. ఇంకా అలానే ఉంది. కానీ, దేవుడి దయతో త్వరలోనే బాగైపోతుంది’ అని తెలిపారు. కాగా, ఒకప్పుడు షారుక్ రోజుకు 100 సిగరేట్లు తాగిన రోజులున్నాయి. తాజాగా సిగరేట్ మానేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news