Bigg Boss telugu 8 : హౌస్ లో ఉన్నది రెండు వారాలే అయినా.. భారీగానే శేఖర్‌ బాషా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షల్లో తెలుసా..?

-

Bigg Boss telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఇప్పుడు రెండు వారాలని పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. మొదటివారం బెబక్క ఎలిమినేట్ అయింది. రెండవ వారం షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. చాలా వారాలు హౌస్ లో ఆడతాడు అనుకున్న శేఖర్ భాష ఊహించిన విధంగా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ బాషా పాలిట శాపంగా మారిపోయింది. ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న ఆదిత్య ఓం శేఖర్ భాష మధ్య ఓటింగ్ జరిగింది. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ శేఖర్ బాషాకి సపోర్ట్ చేయకుండా ఆదిత్య ఓం కి సపోర్ట్ చేశారు.

కిరాక్ సీత తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆదిత్య ఓం మెడలో పూలమాల వేసి హౌస్ లో ఉండాలని కోరుకున్నారు. అయితే రెండు వారాలే ఉన్నప్పటికీ శేఖర్ భాషా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం శేఖర్ భాష రోజుకి 35000 చొప్పున వారానికి 2.5 లక్షల పారితోషకాన్ని తీసుకున్నాడు. అలా రెండు వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న భాష మొత్తం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూడు వారాల్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి. హౌస్ లోకి ఆయన మళ్లీ అడుగు పెట్టొచ్చని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు శేఖర్ భాష భార్య మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆయన బయట కొడుకు ఆలనా పాలన చూసుకుంటాడో లేదంటే మళ్లీ బిగ్ బాస్ లోకి వస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news